అయ్యో పాపం తమన్నా.! అప్పుడలా.. ఇప్పుడిలా.!
- July 05, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకి మోక్షం కుదరట్లేదు. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని జూలై 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు.
అయితే, కొన్ని అనూహ్య కారణాల వల్ల ఈ సినిమా ఆగస్ట్ 5కు వాయిదా పడింది. నిజానికి ఎప్పుడో విడుదల కావల్సిన సినిమా ఇది. కరోనా, ఇతరత్రా కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీని తలపిస్తున్నట్లున్నాయ్.
కానీ, ఈ ఫీల్ గుడ్ మూవీ రిలీజ్‌కి మాత్రం సరైన ఫీల్ ఏర్పడడం లేదు. ఆగస్టులోనైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలీయని పరిస్థితి. అన్నట్లు తమన్నా గతంలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం కూడా ఇలాగే అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రిలీజే కాలేదు ఆ సినిమా.
మరోవైపు సత్యదేవ్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. మొన్నీ మధ్యనే ‘గాడ్ సే’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ‘గుర్తుందా శీతాకాలం’ సత్యదేవ్‌కి ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాడు సత్యదేవ్.చూడాలి మరి, ఆగస్ట్ 5 న ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







