బ్రేకింగ్ న్యూస్: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడో తెలుసా.?

- July 05, 2022 , by Maagulf
బ్రేకింగ్ న్యూస్: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడో తెలుసా.?

మహా భారతాన్నిసినిమాగా తెరకెక్కించాలన్నది జక్కన్న రాజమౌళి డ్రీమ్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తాజాగా రాజమౌళి నోరు విప్పారు. మహాభారతం అనేది మహా సముద్రం లాంటిది. దాన్ని టచ్ చేయడం అంత ఆషామాషీ కాదని రాజమౌళి చెప్పారు. 
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం కథలు వినే పనిలో బిజీగా వున్నారు. ఓహో .! అయితే, ఈ సినిమా తర్వాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తారన్నమాట అనుకుంటున్నారా.? అయితే మీరు తప్పులో కాలేసినట్లే.

మరో నాలుగైదు సినిమాలు చేశాక కానీ, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లదట. అంటే, అటూ ఇటూ ఓ పది పదిహేను సంవత్సరాల సమయం పట్టొచ్చన్నమాట. 
రాజమౌళి ఒక్కో సినిమాకీ దాదాపు రెండు నుంచి మూడేళ్లు సమయం తీసుకుంటారు. ఆ లెక్కల్లో ఈ లెక్క ఒకింత తక్కువే అవుతుంది కానీ, ఎక్కువ ఎంత మాత్రమూ కాదు.
రాజమౌళి నుంచి వచ్చే సినిమా కోసం టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. డైరెక్టర్‌గా ఆ స్థాయిలో తన ముద్ర వేసుకున్నాడు రాజమౌళి. సో డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే, ఆ మాత్రం వుంటుంది మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com