సెక్యూరిటీ ఏజెన్సీల్లో సౌదీ వారికే ఉద్యోగాలు

- July 07, 2022 , by Maagulf
సెక్యూరిటీ ఏజెన్సీల్లో సౌదీ వారికే ఉద్యోగాలు

రియాద్: దేశానికి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీల్లో సౌదీ పౌరులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారికంగా ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సంస్థలకు సంబంధించిన భద్రత కల్పించే వాటిలో సౌదీ వారే ఉండాలని హుకుం జారీ చేసింది. 

ఒకవేళ దీన్ని అతిక్రమించిన సెక్యూరిటీ ఏజెన్సీలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ప్రాసిక్యూషన్ అధికారికంగా ప్రకటించింది. అతిక్రమించిన సంస్థపై ఒక నెల మూసివేత మరియు SR 50,000 జరిమానా, సంస్థ లైెన్సు కూడా రద్దు  చేయవచ్చు. 

సెక్యూరిటీ ఏజెన్సీలు తమ ఉద్యోగుల పట్ల ఏ విధమైన కారణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి.అలాగే ఉద్యోగి యెక్క బీమా బాధ్యతలను సైతం తీసుకోవాలని ఆ దేశ మంత్రిత్వశాఖలతో కూడిన అంతర్గత మండలి ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com