భారీ డిస్కౌంట్లను ప్రకటించిన షార్జా

- July 07, 2022 , by Maagulf
భారీ డిస్కౌంట్లను ప్రకటించిన షార్జా

షార్జా : ఈద్ అల్ అధా ను పురస్కరించుకుని మూడు రోజుల పాటు అన్ని రకాల వస్తుల మీద భారీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు షార్జా దుకాణాల సముదాయం ప్రకటించింది. 

జూలై 6-8 మధ్యన జరగబోతున్న షార్జా వేసవి ప్రమోషన్స్ 2022 ను నిర్వహిస్తున్న షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCCI) లో భాగంగా ఈ మూడు రోజుల భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 80 శాతం వరకు వివిధ రకాల వస్తువల మీద డిస్కౌంట్లు ఉన్నట్లు సమాచారం. 

షార్జా వేసవి ప్రమోషన్స్ సమన్వయ కర్త మరియు SCCI మార్కెటింగ్ మరియు ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ ఇబ్రహీం రషీద్ అల్ జర్వాన్ మాట్లాడుతూ పర్యాటకులను, నగర పౌరులను విశేషంగా ఆకర్షిచేందుకు మరియు అమ్మకాలను పెంచుకునేందుకు ఈ మూడు రోజుల భారీ డిస్కౌంట్స్ ఉపయోగపడతాయి అని పేర్కొన్నారు. 

షార్జా వేసవి ప్రమోషన్స్ పర్యవేక్షణ కమిటీ ఛైర్ పర్సన్ హనా అల్ సువైది మాట్లాడుతూ , ఈ భారీ డిస్కౌంట్ ప్రచారంలో భాగంగా వివిధ వర్గాల పౌరుల అశక్తుల బట్టి అత్యధిక విలువైన బహుమతులను వారు గెలుచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com