ఏఏఐ లో ఉద్యోగాలు
- July 07, 2022
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు.భర్తీ చేయనున్న పోస్టుల్లో 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఏదైనా సెమిస్టర్‌లో ఫిజిక్స్‌మ్యాథమెటిక్స్ ఉత్తీర్ణులవ్వాలి.ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటంలో కనీసం నైపుణ్యం ఉండాలి. అభ్యర్ధుల వయసు 27ఏళ్లు మించకుండా ఉండాలి.ఎంపిక విధానానికి సంబంధించి ముందుగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.అనంతరం ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు.రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్,వాయిస్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తులకు చివరి తేది జులై 14,2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aai.aeroపరిశీలించగలరు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..