హీరో తొట్టెంపూడి వేణు సినిమాలెందుకు మానేశాడో తెలుసా.?
- July 07, 2022
‘స్వయంవరం’ సినిమాతో హీరోగా పరిచయమైన వేణు తొట్టెంపూడి.. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సోలో హీరోగా కొన్ని సక్సెస్‌లు అందుకున్నాడు. ఆ తర్వాత ‘హనుమాన్ జంక్షన్’, ‘పెళ్లాం ఊరెళితే’ తదితర మల్టీ స్టారర్ మూవీస్‌లోనూ నటించాడు.
తర్వాతి కాలంలో వేణుకి అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మారాడు. అలా చేసిన సినిమానే ‘దమ్ము’. జూనియర్ ఎన్టీయార్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో వేణు చిన్న రోల్‌లో కనిపించి మాయమైపోతాడు. ఏమైందో ఏమో కానీ, ఆ తర్వాత పూర్తిగా సినిమాల్లో కనిపించడమే మానేశాడు వేణు తొట్టెంపూడి.
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ప్రత్యక్షమయ్యాడు. లేటెస్టుగా ఈ సినిమా నుంచి వేణు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్లు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో వేణు కనిపిస్తున్నాడు ఈ సినిమాలో.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎందుకు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నారని అడగ్గా.. అనివార్య కారణాల వల్ల.. అని సమాధానమిచ్చి తప్పించుకున్నాడు వేణు. అసలు విషయమేంటో చెప్పలేదు. కాగా, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో వేణుకి ఛాన్స్ ఎలా వచ్చిందంటే, డైరెక్టర్ శరత్ మండవ వేణుని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ రాసుకున్నాడట.
మొదట్లో వేణు ఈ సినిమాకి నిరాకరించగా, కోరి, బతిమలాడి మరీ వేణుని ఈ సినిమాలో భాగం చేశాడట. కోరి వచ్చిన అవకాశాన్ని సైతం వేణు ఎందుకు లైట్ తీసుకున్నట్లు.? సినిమానే ప్రాణం అని చెప్పే వేణు ఇంతకాలం సినిమాలకు దూరంగా వుండి ఏం చేస్తున్నట్లు.? మిలియన్ డాలర్ల ప్రశ్నగా నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇప్పుడీ కొత్త ప్రశ్న.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







