సంక్షేమ రాజకీయాల రథసారథి

- July 08, 2022 , by Maagulf
సంక్షేమ రాజకీయాల రథసారథి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రజా బలంతో ప్రభావితం చేసిన అతికొద్ది మంది నేతల్లో ఒకరు వైయస్సార్ అలియాస్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఒకరు. నేడు 73వ జన్మదినం సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి క్లుప్తంగా మీకు కోసం. 

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందులలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి, తండ్రి ప్రోద్బంతో వైద్య విద్యను పూర్తి చేసి తమ ప్రాంతంలోనే వైద్యునిగా స్థిరపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవను అందించారు. 

వైయస్సార్ యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టి అనంతరం 1978 లో రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలి సారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.అనంతరం రెడ్డి కాంగ్రెస్ నుండి ఇందిరా గాంధీ ఆధ్వర్యం లోని కాంగ్రెస్ పార్టీ లో చేరి రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. నెహ్రూ - గాంధీల కుటుంబం పట్ల విధేయుడిగా ఉంటూ పార్టీ పరంగా అనేక ఉన్నత పదవులను అలంకరించారు. కేవలం 35 ఏళ్లకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (పిసిసి) అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనత సైతం వీరికే సొంతం. 

4 సార్లు లోక్ సభ సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించిన వైయస్సార్ మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా , రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

ముఖ్యమంత్రిగా వైయస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో లబ్ది పొందారు. ఆయా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కున్న చరిష్మా కారణంగానే ఆయన తనయుడు సైతం రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి కాగలిగాడు.

తన సంక్షేమ పథకాల ద్వారా పేదల పెన్నిధిగా నిలిచిన వైయస్సార్ లాంటి నాయకుడు తెలుగు రాజకీయాల్లో మరొకరు లేకపోవడం గమనార్హం.

--వెంకట అరవింద్.డి(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com