తెలంగాణలో కరోనా అప్డేట్..
- July 09, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో మరోరోజు 500లకుపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు, మంగళవారం(జూన్ 28) 459 కేసులు, గురువారం(జూన్ 30) 468 కేసులు, శుక్రవారం(జులై 1) 462 కేసులు, శనివారం(జులై 2) 516 కేసులు, ఆదివారం(జులై 3) 457 కేసులు, సోమవారం(జులై 4) 443 కేసులు, మంగళవారం (జులై 5) 552 కేసులు, బుధవారం (జులై 6) 563 కేసులు, గురువారం(జులై 7) 592 కేసులు, శుక్రవారం (జులై 8) 608 కేసులు నమోదవగా.. తాజాగా ఆ సంఖ్య(జులై 9) 528గా ఉంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24వేల 968 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 528 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 327 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 39 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 485 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8,05,665 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 96వేల 365 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ ను దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 189కి పెరిగింది.రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







