'జనసేన'కు కొత్త 'ఊపిరి'
- April 12, 2016
మార్చి 14వ తేదీ 2014వ సంవత్సరంలో పురుడు పోసుకున్న జనసేన పార్టీ తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కొత్త ఊపిరి అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న కార్యకర్తలు ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ వేదికగా సమావేశమయ్యారు. అంతేకాదు. పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి పోటీ చేయాలని సరికొత్త 'పల్లవి' అందుకున్నారు.విజయవాడలో ఏర్పాటు చేసుకున్న 'జనసేన' పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు విజయవాడ నుంచి పోటీ చేయాలని తీర్మానించుకున్నారు. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం తరువాత జిల్లాల వారీగా జనసేన కార్యవర్గాలు ఏర్పాటు కాగా, ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగకపోవడంతో, కార్యకర్తలు సైతం తమ దారిలో తాము వెళ్లిపోయారు. తిరిగి అడపాదడపా క్రియాశీలకంగా ఉన్నట్టు కనిపించినా రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు వారిలో నూతన ఉత్సాహానికి కారణమయ్యాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







