అంతర్జాతీయ భారత మహిళ అవార్డు ఐశ్వర్యరాయ్‌కి..
- April 12, 2016
పనామా పేపర్స్ వివాదంలో చిక్కుకుని సతమతమవుతున్న తరుణంలో బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు ఇది సంతోషకరమైన వార్త. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ భారత మహిళ అవార్డు లభించింది. ముంబాయ్‌లో జరిగిన ప్రవాసీ భారతీయుల అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఐష్ 'గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డును తన కూతురు ఆరాధ్యకు అంకితం చేసింది 42 సంవత్సరాల ఐశ్వర్య. ఐష్‌తో పాటు ప్రముఖ టన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ప్రత్యేక అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును అంతర్జాతీయ వేదికపై భారతీయ మహిళ ఉన్నతిని పెంచేందుకు లభించిన అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపింది ఐష్. మొదటి నుంచి కూడా తనకు లభించిన ప్రతి అవకాశాన్ని అలానే ఉపయోగించిన తనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సామాజిక గుర్తింపుతో పాటు పలు అవకాశాలు లభించాయని గుర్తు చేసుకున్నారామె. ఈ ప్రవాసీ భారతీయ అవార్డుల ప్రధానోత్సవంలో మొత్తం 17 మంది వ్యక్తిగతంగా అవార్డులు స్వీకరించారు. అందులో వృత్తి, కళ, సంప్రదాయం, స్పెషల్ జ్యూరీ, గ్లోబల్ ఐకాన్, వ్యాపారం ఇలా పలు అంశాల వారీగా అవార్డులు ఇవ్వబడ్డాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







