‘క్యూట్ చార్జి’ వసూలు చేస్తున్న ఇండిగో..
- July 12, 2022
విమానంలో ప్రయాణించేందుకు బుక్ చేసుకునే టికెట్ చార్జీలో అనేక చార్జీలు కలిపి ఉంటాయి. ఎయిర్ ఫేర్ చార్జెస్, సీట్ ఫీ, సెక్యూరిటీ ఫీ, డెవలప్‌మెంట్ ఫీ వంటివి ఉండటం మామూలే. కానీ, ఇటీవల ఇండిగో విమాన సంస్థ క్యూట్ చార్జి కూడా విధించింది. ఒక ప్రయాణికుడు తన టిక్కెట్‌పై ఉన్న క్యూట్ చార్జికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
‘‘వయసుతోపాటు నాలో క్యూట్‌నెస్ కూడా పెరిగిపోతుందని నాకూ తెలుసు. కానీ, దీనికి ఇండిగో సంస్థ చార్జి వసూలు చేస్తుందని మాత్రం అనుకోలేదు’’ అంటూ ఆ నెటిజన్ పేర్కొన్నాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. కొందరు ‘క్యూట్ చార్జి’ని క్యూట్‌గా ఉన్నందుకు విధించే చార్జి అనుకుంటున్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు దీనిపై జోక్స్ వేస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ ‘‘నన్నెవరైనా క్యూట్‌గా ఉన్నావు అంటే వంద రూపాయలు చెల్లించేందుకు అస్సలు బాధపడను. సింగిల్స్ బాధ గురించి మీకేం తెలుసూ’’ అంటూ స్పందించాడు. మరో నెటిజన్ స్పందింస్తూ ‘క్యూట్‌గా ఉన్నందుకు వసూలు చేసే చార్జి అయితే.. నేను వంద రూపాయలు మిగుల్చుకోగలను’ అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే, అదే పోస్టులో డెవలప్‌మెంట్ చార్జీలు ఉండటంపై కూడా నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘నిన్ను వాళ్లు డెవలప్ చేయాలనుకుంటున్నారు. అందుకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. అది నీ క్యూట్ చార్జీలకంటే 3.5 రెట్లు ఎక్కువ’’ అంటూ ఒక నెటిజన్ రిప్లై ఇచ్చాడు. అయితే క్యూట్ చార్జి అంటే అసలు అర్థం వేరు. ‘కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్‌మెంట్ చార్జి’ అని అర్థం. అంటే ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో వాడే మెటల్ డిటెక్టర్, ఎస్కలేటర్ వంటికి వసూలు చేసే చార్జి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







