‘విక్రమ్’ చిరంజీవి చేయాల్సిన సినిమానా.?
- July 12, 2022
లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ విమర్శకుల ప్రశంసలతో సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. ధియేటర్లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రికార్డులు నమోదు చేసింది. రీసెంట్గా ఓటీటీలో విడుదలై అక్కడా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.
చాలా కాలం తర్వాత అసలు సిసలు సినిమా ఎక్స్పీరియన్స్ చేశాం.. అంటూ ‘విక్రమ్’ని ఓటీటీలో వీక్షించిన ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
నిజంగానే ‘విక్రమ్’ అలాంటి అనుభూతినే ఇస్తోంది. అయితే, ఈ సినిమాని, చిరంజీవికి ఆపాదించుకుంటున్నారు మెగా అభిమానులు. ఈ మధ్య ‘ఆచార్య’ సినిమా చిరంజీవి ఇమేజ్‌ని ఎంతలా డ్యామేజ్ చేసిందో తెలిసిన సంగతే. ఓ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మితే దాని ఫలితం ఎలా వుంటుందో ‘ఆచార్య’ సినిమా ద్వారా అర్ధమైంది.
‘ఆచార్య’ డిజాస్టర్‌ని ఎంత మాత్రమూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో వచ్చిన ‘విక్రమ్’ సినిమా.. మెగా అభిమానుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఈ సినిమా చిరంజీవి చేస్తే ఎంత బావుంటుందో.. అనుకుంటున్నారట.
మరికొంత మంది అయితే. అసలు ఈ కథ మొదట చిరంజీవి వద్దకే వచ్చిందట.. అంటూ కట్టుకథలు కూడా అల్లేస్తున్నారు. అవును.. చిరంజీవి విషయంలో అభిమానులు అలా అనుకోవడంలో తప్పు లేదు. ‘విక్రమ్’లాంటి సినిమాలో తమ అభిమాన హీరోని చూసుకోవాలనుకోవడం అస్సలు తప్పు లేదు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







