యూఏఈ దిర్హామ్‌తో పోలిస్తే భారీగా పడ్డ రూపాయి
- July 12, 2022
యూఏఈ: ఈక్విటీ మార్కెట్లలో యూఎస్ డాలర్‌తో (21.66 వర్సెస్ UAE దిర్హామ్) భారత రూపాయి 23 పైసలు బలహీనపడి చారిత్రక కనిష్ట స్థాయికి 79.49 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో పాక్షికంగా కన్వర్టబుల్ రూపాయి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 79.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అంతకుముందు రోజు 79.26 వద్ద ముగిసింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో రూపాయి విలువ 79.49 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ విలువలో ఇది సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. గత వారం నమోదైన యూఎస్ డాలర్‌తో రూపాయి మునుపటి రికార్డు కనిష్ట స్థాయి 79.38 గా ఉంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.48 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో 79.24 గరిష్టాన్ని తాకింది. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడితో రూపాయి బలహీనపడింది. భారత స్టాక్ మార్కెట్ కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు.. ఐటీ, టెలికాం షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







