యూఏఈ దిర్హామ్‌తో పోలిస్తే భారీగా పడ్డ రూపాయి

- July 12, 2022 , by Maagulf
యూఏఈ దిర్హామ్‌తో పోలిస్తే భారీగా పడ్డ రూపాయి

యూఏఈ: ఈక్విటీ మార్కెట్లలో యూఎస్ డాలర్‌తో (21.66 వర్సెస్ UAE దిర్హామ్) భారత రూపాయి 23 పైసలు బలహీనపడి చారిత్రక కనిష్ట స్థాయికి 79.49 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో  పాక్షికంగా కన్వర్టబుల్ రూపాయి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 79.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అంతకుముందు రోజు 79.26 వద్ద ముగిసింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో రూపాయి విలువ 79.49 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ విలువలో ఇది సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. గత వారం నమోదైన యూఎస్ డాలర్‌తో రూపాయి మునుపటి రికార్డు కనిష్ట స్థాయి 79.38 గా ఉంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.48 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో 79.24 గరిష్టాన్ని తాకింది. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడితో రూపాయి బలహీనపడింది. భారత స్టాక్ మార్కెట్ కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు.. ఐటీ, టెలికాం షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com