ఖతార్ లో తగ్గిన రోజువారీ కోవిడ్-19 కేసుల సగటు
- July 12, 2022
దోహా: ఖతార్ లో రోజువారీ సగటు కేసుల సంఖ్య(559) స్వల్పంగా తగ్గిందని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడు రోజుల్లో ఒక మరణం చోటుచేసుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 680కి చేరుకుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా జూలై 11న కొత్తగా 523 కేసులు నమోదు కాగా.. ఇందులో 43 మంది ప్రయాణికులున్నారు. ప్రస్తుతం 4,920 యాక్టివ్ కేసులున్నాయి. ఖతార్లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 389,415గా ఉంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న మొత్తం కేసుల సంఖ్య 383,815. వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటి నుండి అందజేసిన మొత్తం కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 7,268,874 కాగా.. బూస్టర్ మోతాదుల సంఖ్య 1,796,361గా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో మొత్తం 80 కోవిడ్-19 రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







