ఒక మిలియన్ పవిత్ర ఖురాన్ కాపీలు పంపిణీ

- July 12, 2022 , by Maagulf
ఒక మిలియన్ పవిత్ర ఖురాన్ కాపీలు పంపిణీ

మినా: హజ్ యాత్రికులకు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు నుండి బహుమతిగా పవిత్ర ఖురాన్ కాపీల పంపిణీని సౌదీ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాల్ -గైడెన్స్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మక్కా నుంచి బయలుదేరే యాత్రికులకు మొత్తం ఒక మిలియన్ ఖురాన్ ప్రతులను పంపిణీ చేయనున్నారు. జెడ్డా అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, రెడ్-సీ జెడ్డా ఇస్లామిక్ పోర్ట్, ఇతర ల్యాండ్, ఎయిర్ అవుట్‌లెట్‌ల ద్వారా  ఈ సంవత్సరం హజ్‌కు హాజరైన లేదా పనిచేసిన సిబ్బందికి వీటిని అందజేయనున్నారు. మదీనాకు చెందిన కింగ్ ఫహద్ కాంప్లెక్స్ పవిత్ర గ్రంథాన్ని వివిధ పరిమాణాలలో.. 76 అంతర్జాతీయ భాషలలో ప్రచురించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com