ఒకే రోజులో రికార్డు స్థాయిలో 44 తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు
- July 12, 2022
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఒకే రోజులో 44 తీర్పులిచ్చింది.వేసవి సెలవుల అనంతరం విచారణలు పునఃప్రారంభమైన జూలై 11న ఈ ఘనత నమోదైంది.ఈ 44 తీర్పుల్లో 20 తీర్పులను జస్టిస్ ఎంఆర్ షా ఇచ్చారు. మే 23 నుంచి జూలై 10 వరకు అత్యున్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు అనే విషయం తెలిసిందే. ఇది ఇటీవలి కాలంలో ఓ రికార్డు.
కాగా, ఈ కేసుల్లో నేరస్థుల అప్పగింత ఒప్పందాలు, దేశీయ చట్టాలు, క్రిమినల్ అపీళ్లు, సివిల్ వివాదాలు, బ్యాంకింగ్, వ్యాపార వివాదాలు, కోర్టు ధిక్కారం కేసులు, కాంట్రాక్టుల అమలు వంటి అంశాలకు సంబంధించిన కేసుల్లో ఈ తీర్పులు వచ్చాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు మాట్లాడుతూ..వేసవి సెలవుల్లో తాము పరిశోధన చేయడానికి, తీర్పులు రాయడానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈ తీర్పుల వెనుక తర్కం, వివేకంతో కూడిన ఆలోచన వంటివి రాజ్యాంగ న్యాయస్థానాలు, జిల్లా న్యాయస్థానాలు దృష్ట్రాంతాలుగా తీసుకుంటాయని తెలిపారు. విశ్రాంత భారత న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల తర్వాత అనేక తీర్పులు ఇవ్వడానికి న్యాయమూర్తులు చేస్తున్న అద్భుతమైన కృషిని మనమంతా ప్రశంసించాలని తెలిపారు. న్యాయమూర్తులు సెమినార్లకు హాజరవడం, సమావేశాల్లో పాల్గొనడం వంటితోపాటు పరిశోధన, తీర్పులు రాయడం వంటివి చేయడం ప్రశంసనీయమని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







