సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది వారియర్’
- July 12, 2022
హైదరాబాద్: రామ్ ‘ది వారియర్’ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ దక్కించుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జులై 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతి సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. దీంతో అభిమానులే కాక సినీ లవర్స్ సైతం సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలో చిత్ర మేకర్స్ సెన్సార్ కార్య క్రమాలను సైతం పూర్తి చేసి , రిలీజ్ కు సిద్ధమయ్యారు. సినిమాను చూసిన సెన్సార్ అధికారులకు సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే 2గంటల 35నిమిషాల రన్ టైంను మేకర్స్ లాక్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ యాక్షన్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. కాగా ఈ సారి కొంచెం స్టైలిష్‌గా ఖాకి యూనిఫార్మ్ వేసుకుని విలన్‌లను చిత్తు చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ ఖాకి యూనిఫార్మ్ రామ్ కు ఎంతగా కలిసొస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..