బహ్రెయిన్ లో నీట్ పరీక్ష
- July 13, 2022
మనామా: ఇండియా లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET) ను తొలిసారిగా బహ్రెయిన్ లో నిర్వహించనుంది. జూలై 17,2022 న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:50 వరకు వివిధ దశల్లో మనామా లోని ఇండియన్ బహ్రెయిన్ స్కూల్ క్యాంపస్ లో నీట్ ను నిర్వహించనున్నట్లు అధికారిక సమాచారం. అర్హత కలిగిన వారు కచ్చితంగా హాజరు కావాలని నిర్వహకులు తెలిపారు. ఈ పరీక్షను ఇండియాకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుండగా , ఫలితాలను అరోగ్య మంత్రిత్వశాఖ కింద పనిచేసే అరోగ్య సేవల విభాగం విడుదల చేస్తుంది. సీట్ల భర్తీని మాత్రం వివిధ రాష్ట్రాల అధికారిక విద్యా కౌన్సిలింగ్ బోర్డులు ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. పూర్వం ఈ ప్రవేశ పరీక్ష ను అఖిల భారత ప్రీ మెడికల్ టెస్ట్(AIPMT) గా పిలిచేవారు, దీని స్థానంలో ప్రస్తుతం నీట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







