బహ్రెయిన్ లో నీట్ పరీక్ష

- July 13, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో నీట్ పరీక్ష

మనామా: ఇండియా లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET) ను తొలిసారిగా బహ్రెయిన్ లో నిర్వహించనుంది.  జూలై 17,2022 న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:50 వరకు వివిధ దశల్లో    మనామా లోని ఇండియన్ బహ్రెయిన్ స్కూల్ క్యాంపస్ లో నీట్ ను నిర్వహించనున్నట్లు అధికారిక సమాచారం. అర్హత కలిగిన వారు కచ్చితంగా హాజరు కావాలని నిర్వహకులు తెలిపారు. ఈ పరీక్షను ఇండియాకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుండగా , ఫలితాలను అరోగ్య మంత్రిత్వశాఖ కింద పనిచేసే అరోగ్య సేవల విభాగం విడుదల చేస్తుంది. సీట్ల భర్తీని మాత్రం వివిధ రాష్ట్రాల అధికారిక విద్యా కౌన్సిలింగ్ బోర్డులు ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. పూర్వం ఈ ప్రవేశ పరీక్ష ను అఖిల భారత ప్రీ మెడికల్ టెస్ట్(AIPMT) గా పిలిచేవారు, దీని స్థానంలో ప్రస్తుతం నీట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com