కారును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి

- July 14, 2022 , by Maagulf
కారును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి

యూఏఈ: సిగ్నల్ జంప్ చేసిన ఓ బైకిస్టు కారును ఢీకొని మృతి చెందాడు. ఓ మోటారు సైకిలిస్ట్ రెడ్ లైట్ స్కిప్ చేయడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడని ఉమ్ అల్ క్వైన్ పోలీసులు ట్వీట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగింది. ఉమ్ అల్ ఖువైన్ మాల్ కూడలి సమీపంలో మోటార్‌సైకిలిస్ట్ సిగ్నల్ ను జంప్ చేసి ముందుకు వెళ్లి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com