షిప్పింగ్ కంపెనీకి BD 28,000 జరిమానా

- July 15, 2022 , by Maagulf
షిప్పింగ్ కంపెనీకి BD 28,000 జరిమానా

బహ్రెయిన్: ఓడను శుభ్రం చేస్తుండగా ప్రమాదంలో మరణించిన కార్మికుడి తల్లిదండ్రులకు పరిహారంగా BD 28,000 చెల్లించాలని షిప్పింగ్ కంపెనీని హైకోర్టు ఆదేశించింది. అంత్యక్రియల ఖర్చుల కోసం సోషల్ ఇన్సూరెన్స్ కంపెనీ BD1,728 పరిహారంగా చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఓడను శుభ్రం చేస్తుండగా బాధితుడి తలపై భారీ ఇనుప పదార్థం పడటంతో  అతను మరణించాడు. అతని మరణానికి కంపెనీ, వారి ముగ్గురు సహోద్యోగులను కారణమని బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com