‘ది వారియర్‌’కి కలిసొచ్చే అంశమేంటంటే.!

- July 16, 2022 , by Maagulf
‘ది వారియర్‌’కి కలిసొచ్చే అంశమేంటంటే.!

రామ్ పోతినేని, కృతిశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది వారియర్’ సినిమా లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. 

ఈ మధ్య వాతావరణ పరిస్థితులు కూడా సినిమాపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ‘ది వారియర్’ సినిమాని చాలా భయపెట్టిన మాట వాస్తవమే. 

అయితే, ప్రస్తుతం ఈ పరిస్థితులు కాస్త అనుకూలంగా మారడం, సినిమాకి కాస్త కలిసొచ్చే అంశమే. లాంగ్ వీకెండ్ రావడం, కొన్నిచోట్ల విద్యా సంస్థలు బంద్ వుండడం.. వంటి చాలా అనుకూలమైన అంశాలు ‘ది వారియర్’కి కలిసొచ్చేటట్లే వున్నాయ్.
ఈ అనుకూల పరిస్థితుల్ని తట్టుకుని ‘ది వారియర్’ నిలబడితే, హిట్ సినిమా లిస్టులోకి చేరడం ఏమంత కష్టం కాదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ వారం మరే ఇతర పెద్ద సినిమాలు కానీ, చెప్పుకోదగ్గ సినిమాలు కానీ లేకపోవడం కూడా ‘ది వారియర్’కి కలిసొచ్చే అంశాలే.

చూడాలి మరి, ‘ది వారియర్’‌ని ప్రేక్షకులు ఏ లిస్టులోకి చేరుస్తారో. తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా ఇది. అలాగే, రామ్ పోతినేనికి తొలి తమిళ సినిమా కూడా ఇదే. ఈ బైలింగ్వల్ మూవీ ఈ ఇద్దరి ఖాతాలో ఎలాంటి రిజల్ట్ వేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com