‘పుష్ప 2’ కంటే ముందే హరీష్ డైరెక్షన్‌లో బన్నీ.?

- July 16, 2022 , by Maagulf
‘పుష్ప 2’ కంటే ముందే హరీష్ డైరెక్షన్‌లో బన్నీ.?

సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమా సంచలనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఏదో సాదా సీదాగా కానిచ్చేసిన ఈ సినిమాకి టైమూ, లక్కూ రెండూ కలిసొచ్చి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. 

ఈ హిట్ ఇచ్చిన ఇంపాక్ట్‌తో రెండో పార్ట్‌ని కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని తెరకెక్కించాలని ‘పుష్ప’ అండ్ టీమ్ గట్టిగా నిర్ఞయం తీసుకుంది. ఆ క్రమంలోనే ‘పుష్ప 2’ కోసం ముందుగా అనుకున్న సబ్జెక్ట్‌కి మెరుగులు దిద్దడం మొదలెట్టారు. ఆ కారణంగా ఈ సినిమా లేట్ అవుతూ వస్తోంది.
అదలా వుంటే, ఈ లోపు బన్నీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. హరీష్ శంకర్‌ డైరెక్షన్‌లో నటించాలనుకుంటున్నాడట. అదేంటీ.? అలా ఎలా చేస్తాడు.? అనుకుంటున్నారా.? 
హరీష్ శంకర్ డైరెక్షనే కానీ, అది సినిమా కాదండీ బాబూ. ఓ యాడ్ షూట్. ఈ యాడ్ షూట్ కోసం బన్నీ, హరీష్ శంకర్‌తో జత కట్టాడట. ఆ యాడ్ ఏంటనేది తెలీదు కానీ, ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ యాడ్ షూట్ చేయనున్నారట. అందుకోసం థాయ్‌లాండ్‌‌కి చెక్కేశారు బన్నీ, హరీష్ శంకర్.

ఇంటర్నేషనల్ యాడ్ షూట్ అనీ తెలుస్తోంది. కోలా బ్రాండ్స్‌తో బన్నీకి రకరకాల అగ్రిమెంట్స్ వున్న సంగతి తెలిసిందే. అలాంటిదేదైనా అవ్వొచ్చేమో అని అభిమానులు భావిస్తున్నారు. అదేంటో తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com