బాసర ట్రిపుల్ ఐటీలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత
- July 16, 2022
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో 100 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. నిన్న మధ్యాహ్న భోజనంలో ఎగ్‌ఫ్రైడ్ రైస్ పెట్టారు. అది తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.దీంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. వందమందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
కొందరికి అక్కడే వైద్యం అందించగా, తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులను నిజామాబాద్ తరలించినట్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వి.వెంకటరమణను నిజామాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో ఆహారం కలుషితమై వందమందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







