ఖషోగ్గి హత్యపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము: క్రౌన్ ప్రిన్స్

- July 17, 2022 , by Maagulf
ఖషోగ్గి హత్యపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము: క్రౌన్ ప్రిన్స్

జెడ్డా: సౌదీ పౌరుడు జమాల్ ఖషోగ్గి సంఘటన విచారకరం అని క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ జెడ్డాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన సమావేశంలో అన్నారు. ప్రిన్స్ మహ్మద్, ప్రెసిడెంట్ బైడెన్ మధ్య సమావేశం షెడ్యూల్ ప్రకారం.. గంటన్నర పాటు జరగాల్సి ఉన్నా దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా వారు అనేక అంశాలపై చర్చించినట్లు సమావేశంలో పాల్గొన్న సౌదీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఖషోగ్గి కేసులో విచారణలు,  శిక్షల అమలు వరకు అన్ని చట్టపరమైన విధానాలను సౌదీ అరేబియా చేపట్టిందని క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘనలు జరగకుండా నిరోధించే విధానాలను చేపట్టినట్లు తెలిపారు.  ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరగవచ్చని, ఇరాక్‌లోని అబూ ఘురైబ్, ఇతరులను ఉదాహరణగా పేర్కొంటూ అమెరికా కూడా తప్పులు చేసిందని క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా నిరోధించే విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రిన్స్ మహ్మద్ అన్నారు. బైడెన్‌తో సమావేశంలో జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లే హత్య గురించి కూడా క్రౌన్ ప్రిన్స్ ప్రస్తావించారు. ఈ విషయంలో యుఎస్, ఇతర దేశాలు ఏమి చేశాయని నిలదీసినట్లు సమాచారం.  ప్రతి దేశానికి భిన్నమైన విలువలు ఉన్నాయని తెలుసుకోవడం చాలా ముఖ్యమని, వాటిని గౌరవించాలని ప్రిన్స్ మహ్మద్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com