మనిషి ప్రాణాలను కాపాడిన బీచ్ బాల్
- July 17, 2022
మస్కట్: సముద్రంలో బీచ్ బాల్ ని 18 గంటలపాటు పట్టుకుని ఓ వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన గ్రీస్‌లోని కస్సాండ్రాలోని మైటి బీచ్‌లో జరిగింది. నార్త్ మెసిడోనియాకు చెందిన వ్యక్తి ఇవాన్ (30) సెలవులను సరదాగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి బీచ్ కు వచ్చనప్పుడు సముద్రంలో కొట్టుకుపోయాడు. వెంటనే అతని స్నేహితులు విషయాన్ని కోస్ట్‌గార్డ్‌కు తెలిపారు. దాదాపు 18 గంటల తర్వాత రెస్క్యూ సిబ్బంది అతనిని గుర్తించి, రక్షించారు. అతను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అయితే, సముద్రంలో కొట్టుకొని పోయిన అతని స్నేహితుడు మార్టిన్ జోవనోవ్స్కీ జాడ ఇప్పటికి తెలియలేదని కోస్ట్ గార్డు సిబ్బంది తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







