వీసా విషయంలో భారతీయులకు ఉన్న వెసులుబాటు...
- July 17, 2022
దుబాయ్: యూఏఈకి పర్యటన, బిజినెస్, ఉద్యోగం, ఇతరాత్ర అవసరాల కోసం విదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు.దీనికోసం దాదాపు అందరూ ముందుగా పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అయితే, కొన్ని దేశాల వారికి విజిట్ వీసా అవసరం లేకుండా వీసా ఆన్ అరైవల్ లేదా వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యం ఉంటుంది.ఈ సౌకర్యం కొన్ని సందర్భాల్లో భారతీయ పౌరులకు కూడా వర్తిస్తుంది.ఇలా యూఏఈలో వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ వెసులుబాటు ఏఏ దేశాల వారికి, భారతీయులకు ఏఏ సందర్భాల్లో వర్తిస్తుంది. ఈ క్రింది వివరాలు మీ కోసం...
వీసా ఫ్రీ ఎంట్రీ..
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం ఉంటుంది.జీసీసీ దేశాలకు చెందిన వారికి యూఏఈలో ఎంట్రీకి వీసా పర్మిట్ అవసరం లేదు. ఈ దేశాల వారు ఎంట్రీ పాయింట్ వద్ద వారివారి దేశాలకు చెందిన పాస్‌పోర్ట్ లేదా నేషనల్ ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది.
వీసా ఆన్ అరైవల్..
వీసా ఆన్ అరైవల్ సౌకర్యం 30, 90 రోజుల వ్యవధితో ఉంటుంది. 30 రోజుల వ్యవధితో కొన్ని దేశాల వారికి, 90 రోజుల వ్యవధితో మరికొన్ని దేశాల వారికి ఈ వెసులుబాటు ఉంది. ఇక 30 రోజుల కాలపరిమితితో ఇచ్చే వీసా ఆన్ అరైవల్‌కు మరో 10 రోజుల పాటు పొడిగించుకునేందుకు గ్రేస్ పిరీయడ్ సైతం ఇస్తారు. ఈ 30 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే..అన్డోరా, మారిషస్, ఆస్ట్రేలియా,మొనాకో,కెనడా, న్యూజీలాండ్,హాంగ్ కాంగ్, చైనా, సాన్ మారినో, ఐర్లాండ్,సింగపూర్, జపాన్, యుక్రెయిన్, కజాఖ్స్తాన్, యుకె, సౌత్ ఐర్లాండ్, యుఎస్ఏ, మకావ్, మలేషియా, వాటికన్ సిటీ, బ్రూనై ఈ జాబితాలో ఉన్నాయి.
90 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాలు..
ఈ జాబితాలోని దేశాల పౌరులకు ఎంట్రీ వీసా కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.వీరికి 90 రోజుల వ్యవధితో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది.ఈ దేశాల జాబితాలో ఆర్జెంటినా, సిషెల్స్, మోంటెనెగ్రో, హోండురస్, బల్గేరియా, స్వీడన్, రోమానియా, లైచ్టెన్స్టెయిన్, డెన్మార్క్, ఆస్ట్రియా, స్లోవేకియా, నౌరు, హన్గేరి, చిలి, స్విట్జర్లాండ్,
రష్యన్ ఫెడరేషన్, లిథుయేనియా, ఎల్ సాల్వడార్, బహమాస్, ఐలాండ్, స్లోవేనియా, నెథర్లాండ్స్,
ఐస్లాండ్, కోస్తా రికా, ఉరుగుయ్, సెయింట్ విన్సన్ట్ అండ్ ది గ్రానాడైన్స్, లక్సెంబోర్గ్, ఎస్టోనియా, బార్బొడాస్, సోలమన్, ఐలాండ్, నార్వే, ఇటలీ, క్రొయేటియా, ఫిన్లాండ్, మాల్దీవ్స్, పారగువే, బెల్జియం, సౌత్ కొరియా, ఫ్రాన్స్, కిరిబాటి, సైప్రస్, పోలాండ్,సెర్బియా, మాల్టా, జర్మనీ, బ్రెజిల్,స్పెయిన్, పోర్చుగల్, లాట్వియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, అన్డోరా, మారిషస్, ఆస్ట్రేలియా, మొనాకో, కెనడా, న్యూజీలాండ్, హాంగ్ కాంగ్, చైనా, సాన్ మారినో, ఐర్లాండ్, సింగపూర్ ఉన్నాయి.
ఇక వీసా ఫ్రీ ఎంట్రీ లేదా వీసా ఆన్ అరైవల్ వెసుబాటు భారతీయ పౌరులకు ఎప్పుడు వర్తిస్తుందంటే.. భారతీయ పాస్‌పోర్టుతో పాటు అమెరికా జారీ చేసిన విజిట్ వీసా లేదా గ్రీన్‌కార్డు లేదా బ్రిటన్ రెసిడెన్సీ వీసా లేదా యూరోపియన్ యూనియన్ రెసిడెన్సీ వీసా కలిగి ఉంటే ఇది వర్తిస్తుంది.దీని ద్వారా 14 రోజుల పాటు యూఏఈలో ఉండేందుకు వీలు పడుతుంది. ఇక గ్రీన్‌కార్డుదారులు ఆరు నెలల వరకు అక్కడ ఉండొచ్చు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







