షాకింగ్ న్యూస్: రాజకీయాల్లోకి రష్మిక మండన్నా.?

- July 18, 2022 , by Maagulf
షాకింగ్ న్యూస్: రాజకీయాల్లోకి రష్మిక మండన్నా.?

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న రష్మికా మండన్నా మరోవైపు కోలీవుడ్‌నీ, ఏలుతోంది. బాలీవుడ్‌లోనూ ఈ మధ్యనే పాగా వేసింది. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా స్టార్‌డమ్ దక్కించుకుంది.

అంతా బాగానే వుంది. కెరీర్ పీక్స్‌లో వున్న టైమ్‌లో రష్మిక రాజకీయాల ప్రస్థావన ఏంటీ.? రాజకీయాల్లో చక్రం తిప్పగల వయసు కానీ, అనుభవం కానీ రష్మికకున్నాయా.? అసలింతకీ రష్మిక రాజకీయాల గోలేంటీ.? అనుకుంటున్నారా.? అయితే మీకీ విషయం తెలియాల్సిందే.
ఈ మధ్య వేణు స్వామి అనే జ్యోతిష్య పండితుడు తన పాపులారిటీని పెంచుకునేందుకు పాపులర్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్న సంగతి తెలిసే వుంటుంది.

సమంత, చైతూ విడాకులు తీసుకుంటారని ఈ ప్రబుద్ధుడు ముందే చెప్పేశాడట. అలాగే, నయన్‌ తారకి పెళ్లి అచ్చి రాదనే విషయం కూడా ఈ మధ్య ఈయన ప్రస్థావించిన సంగతి తెలిసిందే. వీళ్లే కాదు, ఇలాంటి పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై తన నోటికి వచ్చినట్లు వాగుతూ, ట్రెండింగ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

అలాగే, రష్మిక మండన్నా రాజకీయాల్లోకి వస్తుందంటూ ఈ మేథావిగారు ముందే జోస్యం చెప్పేశారు. మరి, సినిమాలకు గుడ్ బై చెప్పేసి, రష్మిక రాజకీయాల్లో అడుగు పెట్టేస్తుందా.. స్వామి వారి మాట విని. ఏమో.! పెరుమాళ్లకే ఎరుక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com