సినిమా కష్టాలు: ఇలా అయితే కష్టమే బాస్.!

- July 18, 2022 , by Maagulf
సినిమా కష్టాలు: ఇలా అయితే కష్టమే బాస్.!

కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ప్యాండమిక్ తట్టుకుని ఏదో అలా అలా నెట్టుకొచ్చేస్తోందే తప్ప, సినిమా ఇండస్ర్టీ కోలుకొనే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

ఈ తరుణంలో ప్యాన్ ఇండియా పేరు చెప్పి, తారలు రెమ్యునరేషన్‌లు పెరిగిపోవడం, నిర్మాణ వ్యయం పెరిగిపోవడం ఓ ఎత్తయితే, ఓటీటీ ట్రెండింగ్ వచ్చాకా, ప్రేక్షకులు అసలు ధియేటర్లను పట్టించుకోకపోవడం ఇంకో ఎత్తు. పెరిగిన టికెట్టు రేట్లు కూడా ఈ సమస్యల్లో ప్రత్యేకంగా చర్చించుకోదగ్గదే.

గోరు చుట్టుపై రోకలి పోటు అన్న చందాన ఈ సమస్యలన్నీ నిర్మాతల నెత్తిన గుది బండలా మారాయ్. దాంతో నిర్మాతలంతా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. ఆగస్ట్ నుంచి కొన్నాళ్ల పాటు సినిమా చిత్రీకరణలు ఆపేసి అయినా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారట.

ఈ క్రమంలో ఓ పటిష్టమైన కార్యాచరణ కూడా సిద్ధం చేయనున్నారట. అంటే ఆగస్ట్ నుంచి సినిమా షూటింగులు ఆపేస్తారా.? అలా చేస్తే సమస్యలు తీరేది పోయి, మరింత కష్టాల ఊబిలోకి సినీ పరిశ్రమ కూరుకుపోయే ప్రమాదముంది. మరి, నిర్మాతల ఈ షాకింగ్ నిర్ణయం సరైనదేనా.? ఆయా విషయాలపై నిశితంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయ్. ఏం తేలుస్తారనేది నిదానంగా తెలియాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com