ఆ విషయంలో నయన్‌ని మెచ్చుకొని తీరాల్సిందే.!
- July 18, 2022
వ్యక్తిగత విషయాలు కొన్ని కెరీర్‌ని దారుణంగా నాశనం చేస్తుంటాయ్ కొంతమంది సెలబ్రిటీల విషయంలో. కానీ, నయనతార అందుకు అతీతం.తన వ్యక్తిగత జీవితంలో చాలా చాలా ఎదురు దెబ్బలు భరించింది.ముఖ్యంగా ప్రేమ విషయంలో నయన్ తిన్న దెబ్బలు మరెవ్వరూ తిని వుండరేమో.
అయినా ఏమాత్రం కుంగిపోలేదు. ధైర్యంగా నిలబడింది.వ్యక్తిగత జీవితం, ఏ టైమ్‌లోనూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నయన్ కెరీర్‌కి అడ్డంకి కాలేదు.ఒక్క మాటలో చెప్పాలంటే, తన జీవితంలో జరిగిన ఎదురు దెబ్బలే నయన్‌ని రాటు దేల్చాయేమో.ఆమెను సౌత్ క్వీన్‌లా మలిచాయేమో.
నయన్ విషయంలో రెండు లవ్ స్టోరీలు ఫెయిలైన సంగతి తెలిసిందే. అందులో ఒకటి శింబుతో లవ్వాయణం ఓ సెన్సేషన్ కాగా, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో లవ్వు ఏకంగా పెళ్లి పీటల వరకూ చేరడం మరో సెన్సేషన్.
ఈ రెండు సందర్భాలూ నయన్‌ని వ్యక్తిగతంగా చాలా బలహీనపరిచాయనే చెప్పాలి. ఇక, తాజాగా ఆమె విఘ్నేష్ శివన్‌ని వివాహమాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత అయినా నయన్ కెరీర్ డల్ అవుతుందేమో అనుకున్నారు కొందరు. కానీ, ఇప్పుడు కూడా నయన్ క్వీనే.
పెళ్లయినా నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా. మరింత పెరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ప్రమోట్ అయ్యింది నయన్. సల్మాన్ ఖాన్‌తో నయన్ ఓ సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం. అలాగే రెమ్యునరేషన్ విషయంలోనూ నయన్‌ని కొట్టేవాళ్లే లేరు సౌత్‌లో. ఇంతవరకూ 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నయన్ రెమ్యునరేషన్ 10 కోట్లకు చేరిందని టాక్.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!