గోల్డెన్ వీసా హోల్డర్లకు ఉచితంగా ఈసాద్ ప్రివిలేజ్ కార్డు
- July 19, 2022
దుబాయ్: గోల్డెన్ వీసా హోల్డర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను అందించే ఈసాద్(Esaad) ప్రివిలేజ్ కార్డును దుబాయ్ ప్రభుత్వం బహుమతిగా ఇవ్వనుంది. ఈ కార్డ్ ని దుబాయ్ పోలీసులు జారీ చేస్తారు. ఈసాద్ కార్డు సభ్యులకు ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంది. దుబాయ్‌లో 5 ఏళ్లు, 10 ఏళ్ల గోల్డెన్ వీసాలు ఉన్నవారికి ఈ కార్డు ఉచితంగా అందించబడుతుంది. లాంగ్-టర్మ్ రెసిడెన్సీ స్కీమ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు దుబాయ్‌లో 65,000 మంది విశిష్ట గోల్డెన్ వీసా నుండి ప్రయోజనం పొందారు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లలో పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, ప్రత్యేక ప్రతిభ ఉన్న వ్యక్తులు, సైన్స్ పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణులు, ఆవిష్కర్తలు, సంస్కృతి, కళలో సృజనాత్మక రంగాలలో గోల్డెన్ వీసా హోల్డర్లకు ఈ కార్డులను అందజేయనున్నారు. యూఏఈ, ప్రపంచవ్యాప్తంగా 92 దేశాలలో 7,237 బ్రాండ్లు, వ్యాపారాలలో ఈసాద్ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేకమైన ఆఫర్లు, తగ్గింపులు అందుబాటులో ఉన్నాయని దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ అబ్దుల్లా మొహమ్మద్ అల్ బస్తీ తెలిపారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







