బహ్రెయిన్-కొచ్చి విమాన కాక్‌పిట్‌లో పక్షి కలకలం
- July 19, 2022
బహ్రెయిన్: జులై 15 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బహ్రెయిన్-కొచ్చి విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లైట్ డెక్‌లో ఒక చిన్న పక్షి కలకలం సృష్టించింది. బోయింగ్ 737 (IX-474) విమానాన్ని పైలట్లు కొచ్చిలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ఫ్లైట్ టెక్నికల్ టీం పక్షిని సురక్షితంగా పట్టుకొని బయట విడిచిపెట్టారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. విమానయాన వర్గాల కథనం ప్రకారం.. బహ్రెయిన్ మానాశ్రయంలో ఫ్లైట్ సిబ్బంది డ్యూటీ మారారు. ఈ సమయంలో ఒక ఫ్లైట్ ఇంజనీర్ తనిఖీల కోసం ఫ్లైట్ డెక్‌కి వెళ్లాడు. అక్కడ కాక్‌పిట్‌లో ఒక చిన్న పక్షిని (బహుశా పిచ్చుక)ను గమనించాడు. అతను దానిని అక్కడి నుండి ఎగిరిపోయేలా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, భయపడిన చిన్న పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఆ తర్వాత పక్షి తనంతట తానుగా ఎగిరిపోయేలా ఫ్లైట్ డెక్ విండోను తెరిచాడు. తిరిగి 10 నిమిషాల తర్వాత అతను ఫ్లైట్ డెక్‌కి వచ్చి తనిఖీ చేశాడు. ఫ్లైట్ డెక్‌లో లేదా క్యాబిన్‌లో ఎక్కడా పక్షి కనిపించలేదు. దీంతో విమానం కొచ్చికి వెళ్లేందుకు అనుమతి జారీ చేశాడు. ఈ క్రమంలో విమానం కొచ్చికి ప్రయాణిస్తున్నప్పుడు.. పైలట్‌లు ఫ్లైట్ డెక్‌లోని ఫ్లైట్ మాన్యువల్‌లను ఉంచే గ్లోవ్ కంపార్ట్‌మెంట్‌కు సమీపంలో పక్షిని చూశారు. పక్షి ఎగరకుండా కూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో విమానాన్ని పైలట్లు కొచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఫ్లైట్ టెక్నికల్ సిబ్బంది పక్షిని పట్టుకుని సురక్షితంగా విడిచిపెట్టారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









