ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో గౌతమ్ అదానీ..
- July 19, 2022
ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ దూసుకెళ్తున్నారు. ఏడాదిలోనే రికార్డు స్థాయిలో అతని ఆస్తుల విలువ పెరగడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నాలుగో స్థానానికి దూసుకెళ్లారు. ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన వారి జాబితాను ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది. ఈ జాబితాలో.. 230 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా, రెండుమూడు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్ లు నిలిచారు. నాల్గవ స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు.
పోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబీకులతో సహా గౌతమ్ అదానీ మొత్తం సంపద దాదాపు 114 బిలియన్ డాలర్లు. గతంలో నాల్గో స్థానంలో మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఉన్నారు. తాజాగా బిల్‌గేట్స్ 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదవ స్థానంకు పడిపోయారు. తన విరాళాలను క్రమంగా పెంచుతూ.. కుబేరుల జాబితా నుంచి తాను తప్పుకుంటానని ఇప్పటికే బిల్ గేట్స్ ప్రకటించిన విషయం విధితమే.
భారతీయ బిలియనీర్లలో ఒకరైన రియల్స్ అధినేత ముఖేష్ అంబానీ పోర్బ్స్ జాబితాలో 10వ స్థానంకే పరిమితమయ్యారు. ప్రస్తుతం అంబానీ సంపద విలువ 88 బిలియన్ డాలర్లుగా పోర్బ్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ప్రారంభం వరకు ఆసియలో అత్యధిక ఆస్తులు కలిగిన వారి జాబితాలో ముఖేశ్ అంబానీ తొలిస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ స్థానాన్ని గౌతమ్ అదానీ ఆక్రమించిన విషయం విధితమే. 2021 – 22 మధ్య కాలంలో అదానీ నికర విలువ 50 బిలియన్ డాలర్ల నుంచి 90 బిలియన్లకు పెరిగింది. దీంతో ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో సంపద వృద్ధి చేసుకున్న వ్యక్తిగానూ గౌతమ్ అదానీ రికార్డు సృష్టించారు.
అదానీ గ్రూప్ వ్యాపారాలు .. ఎనర్జీ, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, మైనింగ్ అండ్ రిసోర్సెస్, గ్యాస్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎయిర్‌పోర్ట్‌లలో విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం కలిపి 197.49 బిలియన్ డాలర్లు (జూలై 19, 2022 నాటికి) మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పబ్లిక్‌గా జాబితా చేయబడిన ఏడు సంస్థలతో ఏర్పాటు చేయబడింది. దాని ప్రతి వ్యాపార రంగాలలో గ్రూప్ భారతదేశంలో నాయకత్వ స్థానాన్ని ఏర్పరచుకుందని దాని అధికారిక వెబ్సైట్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూరప్‌కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







