TSRTC మరో బాదుడు..
- July 20, 2022
హైదరాబాద్: ఇప్పటికే టిఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రకాల సెస్ ల పేరుతో టికెట్ చార్జీలను భారీగా వసూళ్లు చేస్తుండగా..ఇప్పుడు మరోసారి వారి పై భారం మోపేందుకు సిద్ధమైంది. తాజాగా లగేజీ చార్జీల రూపంలో జులై 22 నుండి ప్రయాణికుల జేబులు ఖాళీ చేయబోతుంది.50 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఇస్తున్నప్పటికీ..ఇక పై అదనపు లగేజీ భారం కానుంది. అదనంగా ఒక కిలో పెరిగినా పాతిక కేజీల వరకు ఒక యూనిట్‌గా పరిగణించి పూర్తి చార్జీని వసూలు చేయబోతుంది.
ప్రతి యూనిట్‌కు ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూ.1 ఛార్జీ వసూలు చేసిన ఆర్టీసీ.. ఈ నెల 22 నుంచి ఆ చార్జీ రూ.20కి పెంచింది.26–50 కిలోమీటర్ల మధ్య లగేజీ ఛార్జీ ప్రతి యూనిట్‌కు ఇంతకుముందు రూ.2గా ఉండగా రూ. 40కి పెంచింది. 51-75 కి.మీ. మధ్య రూ.3 నుంచి రూ.60కి, 76–100 కి.మీ మధ్య రూ.4 నుంచి రూ.70కి పెరిగింది. డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లగేజీ చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెప్పుకొచ్చారు.
ఆర్టీసీ బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే ఇకపై 3యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలు చేయనున్నారు. టీవీ, ఫ్రిజ్, సైకిల్, ఫిలింబాక్సులు, వాషింగ్ మెషీన్, కార్ టైర్లను 2 యూనిట్లుగా, రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్ ఫ్యాన్, 25 లీటర్ల ఖాళీక్యాన్, కంప్యూటర్ మానిటర్, సీపీయూ, హార్మోనియం తదితరాలను ఒక యూనిట్‌గా పరిగణించబోతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







