సైబర్ దాడుల వ్యాప్తి నిరోధంలో ఖతార్ ప్రగతి
- July 20, 2022
ఖతార్: సైబర్-దాడుల వ్యాప్తిని నిరోధించడానికి, సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలలో ఖతార్ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్‌లు, కార్పొరేషన్‌లకు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను గుర్తించడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (GCO) ఒక ట్వీట్‌లో వివరించింది. ప్లాట్‌ఫారమ్ AI సాంకేతికతలను ఉపయోగించి ఫిషింగ్ డొమైన్‌లను గుర్తిస్తుందని పేర్కొంది. ఇందులో భాగంగానే హమద్ బిన్ ఖలీఫా విశ్వవిద్యాలయం, ఖతార్ కంప్యూటింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (QCRI) శాస్త్రవేత్తలు సైబర్ భద్రతను అంచనా వేయడానికి.. గుర్తించడానికి 'వార్నింగ్' అనే సైబర్-సెక్యూరిటీ డిఫెన్స్ ప్లాట్‌ఫారమ్‌ను విజయవంతంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఖతార్ సైబర్-సెక్యూరిటీని చాలా సీరియస్‌గా తీసుకుంటోందని, సైబర్-సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం ద్వారా FIFA వరల్డ్ కప్ 2022 ఈవెంట్ ఎజెండాలో సైబర్-సెక్యూరిటీ, గోప్యతను అగ్రస్థానంలో ఉంచిందని దోహా యూనివర్శిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (UDST)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ది పెనిన్సులా డాక్టర్ అబ్దుల్లతీఫ్ షిక్ఫాకు తెలిపాడు. ఖతార్ 2013లో జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని అభివృద్ధి చేసిందని, 2006లోనే ఖతార్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







