భారత్ కరోనా అప్డేట్
- July 20, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. కరోనా వల్ల మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,25,825కి చేరిందని తెలిపింది. దేశంలో హోం క్వారంటైన్లు, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 1,45,654కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
నిన్నటికంటే యాక్టివ్ కేసుల సంఖ్య 2,000 పెరిగిందని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,32,140కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో బూస్టర్ డోసును ఉచితంగా ఇస్తున్నారు. నిన్న దేశంలో 26,04,797 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో ఇప్పటివరకు వేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200,61,24,684కి చేరిందని తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







