గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..50°Cకి చేరుకునే అవకాశం

- July 20, 2022 , by Maagulf
గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..50°Cకి చేరుకునే అవకాశం

సౌదీ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరగడం అందోళన కలిగిస్తోంది. గల్ఫ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు దాదాపు 50°Cకి చేరుకుంటాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. మంగళవారం నాడు దమ్మామ్ నగరంలో 48 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని.. ఇది రాజ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత అని పేర్కొంది. ఆ తర్వాత అల్-ఖర్జ్ నగరంలో 46°C, రాజధాని నగరం రియాద్‌లో 45 °C నమోదైందని ప్రకటించింది. మరోవైపు కువైట్‌లో ఈ వారంలో (బుధవారం నుండి శనివారం) ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ నుండి 50 ° C వరకు నమోదయ్యే అవకాశం ఉందని కువైట్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒమన్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం, చురుకైన గాలులు వీచే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ జనరల్ హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com