కువైట్-ముంబై విమానంలో పొగతాగిన ప్రయాణికుడు అరెస్టు
- July 20, 2022
కువైట్: కువైట్-ముంబై విమానంలో పొగతాగిన 50 ఏళ్ల ప్రయాణికుడిని ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత భద్రతా అధికారులు అరెస్టు చేశారు. భారతీయ మీడియా కథనం ప్రకారం.. మంగళవారం మహ్మద్ షాహిద్ కువైట్ నుండి ముంబై వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగానే వాష్‌రూమ్‌లోకి వెళ్లి స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. పొగను గమనించిన సిబ్బంది.. ఆ తర్వాత పొగతాగడం ఆపేయాలని కోరారు.విమానం ముంబైలో దిగిన తర్వాత మహ్మద్ షాహిద్ పై భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై IPCలోని సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని బెయిల్‌పై విడుదల చేశారు. అనంతరం మహ్మద్ షాహిద్ మాట్లాడుతూ.. విమానంలో స్మోకింగ్ నిషేధం అన్న విషయం తనకు తెలియదని చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







