వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో
- April 13, 2016
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న శ్రీను వైట్ల ఆగడు, బ్రూస్ లీ తర్వాత ఒక్కసారిగా డౌన్ అయ్యాడు. ఆయనతో సినిమాలు చేయాలంటేనే టాప్ హీరోలు భయపడే పరిస్థితి వచ్చిందని టాక్. అయితే తనలోని సత్తా ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసుకునేందుకు శ్రీను వైట్ల మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసాడు. వరుణ్‌తో ఓ సూపర్ హిట్ చిత్రాన్ని తీసి తనలోని టాలెంట్‌ని నిరూపించుకునేందుకు మంచి స్క్రిప్ట్‌తో సిద్దమయ్యాడు.వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు చివరి దశకు చేరగా, ఈ నెల 27న హైదరాబాద్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు వైవిధ్యమైన సినిమాలలో నటించి మెప్పించిన వరుణ్ ఈ చిత్రం కోసం తన గెటప్‌ని పూర్తిగా మార్చేసుకున్నట్టు సమాచారం. వరుణ్ గెటప్‌కి సంబంధించి కొన్ని లుక్స్ ఇటీవల విడుదల కాగా, ఆ గెటప్‌ని చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫాం చేయలేదు. నల్లమలపు శ్రీనివాస్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మే 27నే ప్రకటించనున్నట్టు టాక్.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్‌లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









