జిలీబ్ ప్రాంతంలో తగ్గిన ప్రవాసుల సంఖ్య
- July 21, 2022
కువైట్: జిలీబ్ ప్రాంతంలో నివసించే వారి సంఖ్య తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డేటా ప్రకారం.. 2021 చివరి నాటికి జిలీబ్ లో నివసించే వారి సంఖ్య 271,000కి చేరుకుంది. 2019లో ఆ ప్రాంతంలో సుమారు 328,000 మంది ప్రజలు నివసించేవారు. 56,779 మంది వివిధ ప్రాంతాలకు మకాం మారినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అధిక సంఖ్యలో ప్రవాసులు నివసించే రెండవ అత్యంత రద్దీ ప్రాంతంగా జిలీబ్ ఉండేది. రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించేవారు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉంటున్నట్లు తేలడంతో.. ఈ ప్రాంతంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రవాసులు వివిధ ప్రాంతాలకు మకాం మార్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







