నకిలీ విగ్రహాల విక్రయం.. లండన్ ఆర్ట్ డీలర్‌పై కేసు పెట్టిన ఖతార్ షేక్
- July 21, 2022
ఖతార్: £4.2 మిలియన్లు తీసుకొని 'నకిలీ' పురాతన విగ్రహాలను అంటగట్టడం ద్వారా తనను మోసగించినట్లు ఆర్ట్ డీలర్‌పై లండన్ కోర్టులో ఖతార్ షేక్ దావా దాఖలు చేశాడు. జాన్ ఎస్కెనాజీ ఆర్ట్ కలెక్టర్ తనను పురాతన విగ్రహల పేరిట మోసం చేశాడని షేక్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ థానీ ఆరోపించారు. తనకు అమ్మిన విగ్రహలు 1,400, 2,000 సంవత్సరాల క్రితం నాటివని డీలర్ తనకు చెప్పినట్లు షేక్ కోర్టులో పేర్కొన్నారు. కానీ అవి నకిలీవని నిపుణులు తేల్చడంతో వాటిని వాపస్ తీసుకొని తన డబ్బు తిరిగి చెల్లించాలని కోరినా.. ఆర్ట్ డీలర్ నిరాకరించినట్లు తెలిపాడు. తన అమ్మిన విగ్రహాల్లో మట్టి, ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నాయని నిపుణులు తేల్చారని ఖతార్ షేక్ కోర్టులో వాదించారు. అయితే ఆర్ట్ డీలర్ జాన్ ఎస్కెనాజీ.. ఖతార్ షేక్ వాదనలను తిరస్కరించాడు. ప్రస్తుతం లండన్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







