దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో జాక్పాట్ కొట్టిన భారతీయుడు

- July 21, 2022 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో జాక్పాట్ కొట్టిన భారతీయుడు

దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా లో రెహోబోత్ డానియల్ అనే భారత దేశానికి చెందిన వ్యక్తి ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు.బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో డానియల్ విజేతగా నిలిచాడు.ఇటీవల అతడు కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ లాటరీ టికెట్ నం.1002కు ఈ జాక్‌పాట్ తగిలింది.దీంతో రాత్రికి రాత్రే అతడి బ్యాంక్ ఖాతాలోకి 1 మిలియన్ డాలర్లు వచ్చిపడ్డాయి.దుబాయ్‌లో ఓ బుక్ షాప్ యజమాని అయిన 63 ఏళ్ల డానియల్ 20 ఏళ్ల నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో పాల్గొంటున్నాడు.అప్పటి నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటానని తెలిపాడు.ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.“ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు.మీ ప్రమోషన్ చాలా మందికి సహాయం చేస్తోంది.ఇది చాలా కాలం పాటు కొనసాగాలని ప్రార్థిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com