ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్ష...

- July 21, 2022 , by Maagulf
ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్ష...

కువైట్ సిటీ: కువైట్ క్రిమినల్ కోర్టు తాజాగా ఈజిప్ట్ దేశానికి చెందిన ఓ ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు 5.40లక్షల కువైటీ దినార్లు అతడు పనిచేసిన సంస్థకు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. ఈజిప్ట్‌కు చెందిన ప్రవాసుడు, ఫహహీల్ కోఆపరేటివ్ సోసైటీలో పని చేశాడు.ఆ సమయంలో భారీ అవకతవకలకు పాల్పడ్డాడు. అలా ఒకటికాదు రెండుకాదు ఏకంగా 5.40లక్షల కువైటీ దినార్ల సోసైటీ నిధులను స్వదేశంలోని అతని బ్యాంక్ ఖాతాకు మళ్లీంచాడు.అనంతరం కొన్ని రోజుల తర్వాత సోసైటీలో ఉద్యోగం మానేసి స్వదేశానికి చెక్కేశాడు. 

ఈ క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఫ్రాడ్ జరిగినట్టు నిర్దారించారు. నకిలీ రసీదులతో ప్రవాసుడు పలు దఫాలలో ఏకంగా 5.40లక్షల దినార్లు తన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు తేల్చారు. అయితే, అప్పటికే అతగాడు స్వదేశానికి చెక్కేయడంతో సంస్థ యాజమాన్యం కువైత్ క్రిమినల్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ప్రవాసుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు అతడు సంస్థను మోసగించి తీసుకున్న  5.40లక్షల దినార్లు తిరిగి చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com