ఆ సింగర్ చేసిన తప్పేంటీ.? ఎటు పోతోంది ఈ సమాజం.?
- July 21, 2022
సింగర్ శ్రావణ భార్గవి అందరికీ సుపరిచితురాలే. ఆమె గొంతులో ఏదో మాధుర్యం వుంది. అందుకే ఇట్టే నచ్చేస్తుంటుంది. ఆమె స్వరం వీనుల విహారం. ఇవన్నీ తెలిసిన సంగతులే. అందుకే ఆ మధుర స్వరంతో అన్నమయ్య కీర్తనను ఆలపించాలన్న కోరిక పుట్టిందట శ్రావణ భార్గవికి.
అనుకున్నదే తడవుగా, ‘ఒక పరి..’ అనే అన్నమయ్య కీర్తనను తన సొంత గొంతుతో అందుకుంది. గాన మాధురే కదా. పాట బాగా వచ్చింది. అయితే, వచ్చిన చిక్కల్లా.. ఈ పాటకు శ్రావణ భార్గవి ఓ వీడియో చేసింది. ఆ వీడియోని యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.
అదే చిక్కు తెచ్చిపెట్టింది. ఈ వీడియోలో శ్రావణ భార్గవి కాస్త అభ్యంతరకరంగా కనిపించిందట అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్ల కళ్లకు. అదేనండీ, టీటీడీ ప్రతినిధులు కొందరికి. ఇక అంతే, అన్నమయ్య కీర్తన పాడుతూ శృంగారం చేస్తావా.. అంటూ ఆ వీడియోని యూ బ్యూట్ నుంచి తొలగించాలంటూ ఆమెపై తెగ గుస్సా అవుతున్నారు.
ఆ వీడియోలో వాళ్ల కళ్లకు కనిపించిన శృంగారం ఏంటో అర్ధం కాక కొందరు జుట్టు పట్టుకుంటున్నారు. అందులో తప్పేముంది..? అంటూ శ్రావణ భార్గవి సైతం ఎదురు ప్రశ్నిస్తోంది.
అందుకేనేమో.. ‘ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామా..’ అంటూ సమంత ముందే చెప్పేసింది చూసే కళ్లల్లోనే వుంది వంకర బుద్ది..!
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







