లైగర్ అదరగొట్టశాడుగా.! హిట్టు గ్యారంటీనా.?
- July 21, 2022
రౌడీ స్టార్ విజయ దేవరకొండ నటించిన ‘లైగర్’ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. లేటయినా, చాలా చాలా లేటెస్టుగా వస్తున్నానంటూ విజయ్ చెబుతున్నాడు. అలాగే, విజయ్ గురించి ఇంతవరకూ మాట్లాడుకున్నది ఓ ఎత్తు.. ‘లైగర్’ తర్వాత ఇంకో ఎత్తు.. అంటూ పూరీ జగన్నాధ్ చెప్పాడు.
ప్రమోషన్లలో భాగంగా ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. పూరీ మార్కు డైలాగులతో భారీ యాక్షన్ సీక్వెన్సెస్‌తో ‘లైగర్’ ట్రైలర్ దద్దరిల్లిపోతోంది. సినిమాలో విజయ్‌కి తల్లిగా నటించిన రమ్యకృష్ణ మరోసారి మంచి పాత్రలో కనిపించింది.
ఈ సారి మాస్ ఊరమాస్ తల్లిగా నటించింది రమ్యకృష్ణ. సినిమా మొత్తం ఈ తల్లీ కొడుకులే వున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు..అనేంతలా వీరి పాత్రల్ని డిజైన్ చేశాడు పూరీ.
ఇక, అనన్యా పాండే అందంగా కనిపించింది. ట్రైలర్ చూస్తుంటే, బొమ్మ హిట్టే అనే అభిప్రాయానికి వచ్చేసేలా కట్ చేశారు. చూడాలి మరి, అంచనాల్ని అందుకుంటాడో లేదో ‘లైగర్’.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







