టిక్కెట్ల ఇష్యూ ‘థాంక్యూ’ని గట్టెక్కిస్తుందా.? ముంచేస్తుందా.?
- July 21, 2022
అక్కినేని నాగ చైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమా రిలీజ్‌కి ముస్తాబైన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య తరచూ వినిపిస్తోన్న అంశాల్లో ఒకటి టిక్కెట్టు రేటు ఇష్యూ.
సినిమా రిలీజ్ అనౌన్స్‌మెంట్లతో పాటు, టిక్కెట్ రేట్ల పెంపు, తగ్గింపు అంశాలను కూడా అనౌన్స్ చేసి చెప్పాల్సి వస్తోంది. అలాగే, ఈ సినిమాకీ టికెట్టు రేట్లు పెంచడం లేదహో అంటూ, టముకు వేసి చెప్పుకుంటున్నారు నిర్మాతలు.
బాగానే వుంది. కానీ, ‘థాంక్యూ’ సినిమాకి దాదాపు 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. చాలా తక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ కనిపించాయట. ఇలా అయితే, కష్టమే అంటున్నారు. సినిమాకి మంచి టాక్ వస్తే తప్ప, సినిమా గట్టెక్కడం కష్టమే అంటున్నారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అవికా గోర్, మాళవిక ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







