మూడు నెలల్లో 150 శాతం పెరిగిన ప్రయాణ బీమా డిమాండ్
- July 21, 2022
యూఏఈ: ప్రముఖ బీమా, ఆర్థిక ఉత్పత్తుల మార్కెట్ ప్లేస్ Policybazaar.ae ప్రకారం.. UAE నివాసితులలో ప్రయాణ బీమా కోసం డిమాండ్ మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో 150 శాతం పెరిగింది. అనేక దేశాలు బీమాను తప్పనిసరి చేయడం, కొవిడ్ మహమ్మారి భయం, వివిధ విమానాశ్రయాలలో సిబ్బంది కొరత కారణంగా సామాను కోల్పోవడం వంటివి ప్రయాణ పాలసీకి డిమాండ్ పెరగడానికి కొన్ని కారణాలని Policybazaar.ae CEO నీరజ్ గుప్తా తెలిపారు. యూఎస్ఏ, స్కెంజెన్ దేశాలు, ఇండోనేషియా, యూకే వంటి అగ్రశ్రేణి పర్యాటక ప్రాంతాల నుండి కంపెనీకి డిమాండ్ పెరిగిందన్నారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాని దేశాలకు వెళ్లే వారు కూడా కోవిడ్-19కి సంబంధించిన భయాల కారణంగా బీమా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







