తెలంగాణ కరోనా అప్డేట్
- July 21, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35వేల 094 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 765 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 356 కేసులు వచ్చాయి. నల్గొండ జిల్లాలో 58, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కేసులు, ఖమ్మంలో 34 కేసులు వెల్లడయ్యాయి.అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 648 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8,12,381 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 03వేల 661 మంది కోలుకున్నారు.రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 609కి చేరింది.రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 31వేల 265 కరోనా టెస్టులు చేయగా.. 640 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







