Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ.. ఐదుగురుకి జైలు శిక్ష
- July 22, 2022
దుబాయ్: Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ కేసులో దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఐదుగురు ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 3 నెలల జైలు శిక్ష వేసింది. ఒక ఆసియా డ్రైవర్‌కు చెందిన వాహనం నుండి 6,000 దిర్హాంతో పాటు 19 బాక్సుల ఎలక్ట్రానిక్ సిగరెట్లను దొంగిలించినందుకు వారికి ఈ శిక్షలను కోర్టు ఖరారు చేసింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత దోషులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ సంఘటన గత మార్చిలో చోటు చేసుకుంది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు సీఐడీ బృందం విచారణ చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. చోరీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని, వాటిలో ఒకటి రెండు వాహనాల ద్వారా దొంగిలించిన వస్తువులను రవాణా చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







